NDL: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తున్నామని కట్టుదిట్టమైన చర్యలతో అత్యధికంగా ప్రజాభిప్రాయాలను సేకరిస్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలపై, ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.