HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జోరులో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర దిశర రంగంలోకి దిగారు. వెంగర్రావు నగర్ డివిజన్, జవహర్నగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి, తమ తల్లి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను కారు గుర్తుపై భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ, జూబ్లీహిల్స్ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.