NLG: త్రిపురారం(M) మునగబాయిగూడెంలో మోస్తారు వర్షాలు కురిసిన కూడా రోడ్డు మొత్తం జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కారణంగా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి కూడా చాలా అవస్థలు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.