ADB: గాదిగూడ మండలంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు నగేశ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యశ్వంత్, వెంకటేష్, సొము, చంద్రకాంత్ తదితరులున్నారు.