జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని నవీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ స్థానంలో BRS అభ్యర్థిగా మాగంటి సునిత పోటీ చేస్తున్నారు.