VZM: అర్జీదారులతో సానుకూల దృక్ఫథంతో వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు సంబంధించిన ఐవిఆర్ఎస్ కాల్స్ డేటాపై సమీక్షించారు. ప్రధానంగా ఐవిఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరుగుతోందని చెప్పారు.