W.G: భీమవరం కలెక్టరేట్లో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. యాత్రికుల సౌకర్యార్థం 42 పుష్కర ఘాట్లకు సంబంధించిన మరమ్మతులు, అప్రోచ్ రోడ్లు, తాగునీరు, శానిటేషన్, లైటింగ్, టాయిలెట్స్ పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రేపట్లోగా పనుల నివేదిక సమర్పించాలని జేసీ కోరారు.