GNTR: రహదారి ప్రమాదాల నివారణ కోసం గుంటూరు జిల్లాలో పోలీసుల బృందాలు నిన్న రాత్రి విస్తృతంగా తనిఖీలు చేశారు. కాజా టోల్గేట్, చుట్టుగుంట వంటి కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేసి 78 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రూ. 7,79,720 జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్‌ను కూడా సీజ్ చేశారు.