MHBD: కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి పెద్ద చెరువులో శుక్రవారం జిల్లా మత్స్యశాఖ అధికారి గంగన్ శివప్రసాద్ ఆధ్వర్యంలో చేప పిల్లలను పోశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్ ముదిరాజ్, జిల్లా ప్రమోటర్ పిచ్చయ్య, జిల్లా మహాసభల నాయకులు మధుకర్, పోగుళ్లపల్లి సొసైటీ అధ్యక్షుడు బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.