KMM: కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసిఐ) పత్తి కొనుగోలు నిబంధనలు ఎత్తివేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలి, రబీ సీజన్ సన్న ధాన్యం బోనస్ 63 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.