ప్రకాశం: పొదిలి ఆర్టీసీ డిపో నుంచి పంచరామాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ శంకరరావు తెలిపారు. మహానంది, యాగంటి, భైరవకోన, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శనివారం రాత్రి అరుణాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు వెళ్తుందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.