KMR: జిల్లాలో ఆన్లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాలు.. రామారెడ్డి (M) రెడ్డిపేట వాసి రాజు ఫోన్లో వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో బాధితుడి నుంచి రూ. 1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోసమని గ్రహించి PSలో ఫిర్యాదు చేశాడు.