SKLM: నగరంలోని గుజరాతీ పేటకు చెందిన ఓ బాలుడు శుక్రవారం రాత్రి పాత వంతెన వద్ద నాగావళి నదిలో దూకాడు. ఐటీఐ చదువుతున్న విద్యార్థి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించడంతో వెంటనే బయటకు వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. ఒకటో పట్టణ ఎస్సై హరికృష్ణ వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.