KRNL: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా గత నెల 29న సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇవాళ రెండో శనివారం సెలవు ఉన్నప్పటికీ విద్యా సంవత్సరంలో పనిదినాలు అమలుపరచడంలో భాగంగా శనివారం అన్ని పాఠశాలలు యథావిధిగా ఓపెన్ ఉంటాయని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన సూచించారు.