SRPT: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా భద్రాచలం నుంచి మద్దిరాల వైపు ఇసుక రవాణా చేస్తున్న, రెండు ఇసుక లారీలను శుక్రవారం సాయంత్రం సీజ్ చేసి, లారీ డ్రైవర్ పై, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. లారీలో భద్రాద్రి కొత్తగూడెం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా నూతనకల్ మండల శివారులో జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.