కృష్ణా: పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన వినయ్ కుమార్ గుండె చికిత్స కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆయన సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 1,59,668 మంజూరైంది. ఈ చెక్కును ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ శుక్రవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వినయ్ కుమార్‌కు అందజేశారు. దీంతో ఆయన ప్రభుత్వ విప్‌కు కృజ్ణతలు తెలిపారు.