ఏలూరులో నిన్న లారీ ప్రమాదం మరువకముందే, శుక్రవారం రాత్రి రిలయన్స్ మాల్ వద్ద మరో ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులతో వచ్చిన ఆటో సెల్లార్ పార్కింగ్ లోని జనరేటర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆటో దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం రూ.1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.