MLG: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సిబ్బంది, పార్ట్ టైం టీచర్లు గురువారం DCO వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. గత 3నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా తాము విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. స్పందించి జీతాలను వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం అందచేశారు.