HYD నుంచి కాళ్లకల్ వెళ్లే జాతీయ రహదారి 44 పనుల ఆలస్యంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపనులు జరుగుతుండగా గ్రావెల్ రోడ్డుపై గుంతలు ఏర్పడి, ఇటీవల కురిసిన వర్షానికి కనీసం వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. మరోవైపు అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నుంచి సుచిత్ర వరకు పనులలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు.