JN: జిల్లా ఉద్యమ కేసులో భాగంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం జనగామ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. ఉద్యమకారుల పోరాటం వల్లనే జనగామ జిల్లాను సాధించుకోగలిగామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉద్యమకారులపై కేసును కొట్టేయాలని కోరారు. ఉద్యమకారులు మంగళంపల్లి రాజు తదితరులున్నారు.