మేడ్చల్: కాప్రా డివిజన్ చంద్రపురి ఎక్స్టెన్షన్ రూ.24 లక్షల నిధులతో మంజూరైన సీసీ రోడ్ పనులు, ప్రభుత్వ స్థల సమస్యల కారణంగా నిలిచిపోయాయి. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని కలిశారు. త్వరలోనే రోడ్ పనులు ప్రారంభిస్తామని, సమస్య పరిష్కారంలో తన కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.