WNP: బీసీలపై జరుగుతున్న ఎన్నికల డ్రామా అగ్రవర్ణాల నేతల కుట్ర అని వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీశ్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ తూతూ మంత్రంగా జరగడం వల్లే హైకోర్టులో ఎన్నికలు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయడంలో పాలకులు చిత్తశుద్ధి చూపడం లేదన్నారు.