TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాము ఊహించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తరపున తాము బలమైన వాదనలు వినిపించామన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.