మేడ్చల్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో ఈ నెల 12వ తేదీన పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. ఆయా మూడు జిల్లాల పరిధిలో 12న ప్రతి ఒక్కరూ ఐదేళ్లలోపు పిల్లలకు అందించాలని డాక్టర్లు సూచించారు. ఈ ప్రోగ్రాం కోసం ప్రత్యేక సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తామన్నారు.