NLR: రూరల్ నియోజకవర్గం పరిధిలో 24 గంటలు త్రీఫేస్ కరెంటు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్రీఫేస్ కరెంట్‌కి సంబంధించి ఇప్పటికే 97 శాతం పనులు పూర్తయ్యాయని, మరో మూడు శాతం పనులు ఈనెల 25 లోగా పూర్తవుతాయన్నారు.