TG: బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ఆలోచన చేయలేదన్నారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టం ఓబీసీలకు ఉరితాడుగా మారిందన్నారు. తమకు సంకల్ప బలం ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చామన్నారు. తమ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారన్నారు.