మహబూబ్నగర్ పట్టణంలోని హబీబ్ నగర్ ప్రాంతానికి చెందిన జహంగీర్ విద్యుత్ ప్రమాదంలో మరణించారు. మృతుడిది పేద కుటుంబం కావడంతో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి మృతుడి కుటుంబానికి 4.5 లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కును గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.