VZM: బొండపల్లి మండలంలోని పలు అనుమానిత ప్రదేశాలలో గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ జనార్ధనరావు ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. నెలివాడ గ్రామంలో వెంకటరావు 9 మద్యం సీసాలతో పట్టు పడడంతో సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్సై నరేంద్ర కుమార్, హెచ్సీ భాష, లోకాభిరామ్ కానిస్టేబుల్ అప్పారావు పాల్గొన్నారు.