కోనసీమ: జిల్లాల్లో అట్లతద్ది సందడి ఘనంగా సాగింది. పెళ్లి అయినవారే కాకుండా పెళ్లి కాని మహిళలు కూడా ఈ పండుగను నిర్వహిస్తారు. గురువారం అట్లతద్ది సందడి తెల్లవారుజాము నుంచి మొదలయింది. ఉదయం నుంచి ఉపవాసం ఉండడం, ఉయ్యాల్లో ఊగడం, గోరింటాకు, పేరంటాలతో సరదాగా గడిపారు. సాయంత్రం వేళ నదులు, కాలువలు వద్దకు మహిళలు వచ్చి గౌరమ్మకు పూజలు చేశారు.