KDP: ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు గురువారం అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా మదనపల్లిలోని వెన్నెల గార్డెన్లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు ప్రజారవాణా భద్రత, బస్ స్టేషన్లలో భద్రతా చర్యల బలోపేతంపై చర్చించారు. కాగా, ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షితమైన, నమ్మకమైన సేవలను అందించడమే మా లక్ష్యం అన్నారు.