SS: మడకశిర, అమరాపురం, గుడిబండ, ఆగలి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నేరాలను పూర్తిగా అరికట్టాలని అన్నారు. గంజాయి రవాణా, మట్కా, గ్యాంబ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 32 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతుందని, పోలీసులు తప్పు చేస్తే సస్పెన్షన్ తప్పదని అన్నారు.