KDP: కుప్పం ద్రవిడ వర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల గురువారం MLC శ్రీకాంత్‌ను కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. వర్సిటీ స్థాపించినప్పటి నుంచి పనిచేస్తున్నా నేటికి ఉద్యోగ భద్రత లేదని, నెలనెలా సక్రమంగా జీతాలు రావడం లేదంటూ పలువురు వాపోయారు. కాగా, వర్సిటీలో నెలకొన్న సమస్యలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.