NGKL: మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి కార్మికులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. 2022 సంవత్సరంలో చెల్లించాల్సిన ఏరియర్స్ ఇప్పటివరకు చెల్లించకపోవడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.