VZM: కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ సెల్ ఛైర్మన్గా నెల్లిమర్లకు చెందిన దేసరి మురళిని నియమించారు. ఈమేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ నియామక పత్రాన్ని గురువారం పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, జిల్లాలో గల ఎస్టీ సెల్ సామాజిక వర్గానికి, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.