MBNR: స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీసీలు ప్రతిసారి మోసపోతూనే ఉన్నారని బీసీ మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. 42 % బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు 4 వారాల స్టే ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతే కారణమన్నారు. ఎన్నికలు వస్తాయని ఎంతోమంది బీసీలు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉంటే, స్టే విషయం పట్ల అధికార పార్టీ నాయకులు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు