అన్నమయ్య: పీలేరులో గురువారం కాన్సీరామ్ 19వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.1934 మార్చి 15న పంజాబ్లో జన్మించిన కాన్సీరామ్, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజనులకు రాజ్యాధికారం అందించారని పీలేరు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు తెలిపారు. ఆయన బోధనలు,’పే బ్యాక్ టు సొసైటీ’ నినాదం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమన్నారు.