NLR: విడవలూరు మండలంలోని మన్మధరావుపేట గ్రామంలో రెండు రోజులపాటు గిరిజన రైతులకు జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు దేవసేన ఎరువుల యాజమాన్యం పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరి, వేరుశనగలో విత్తన శుద్ధి గురించి ఆవశ్యకతను తెలియజేశారు. వరిలో కాండం తోలుచు పురుగు, సుడిదోమ ఆకుముడత యొక్క లక్షణాలను వివరిస్తూ వాటి యొక్క నివారణ చర్యలను వివరించారు.