E.G: అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేయడం జరిగిందని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజెపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప మాల ధరించిన భక్తులకు మాల ధరించిన రోజు నుంచి చివరి రోజు వరకు మధ్యాహ్న పూట బిక్షను ఎస్.కె ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.