KMM: విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని విస్తరించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని Dy.Cm భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ పంపు సెట్లతో పాటు గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ విద్యుత్ అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. ఇప్పటికే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.