ADB: బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే తో రాష్ట్ర ప్రభుత్వ కుటిల నీతి బయటపడిందన్నారు. బీసీల న్యాయబద్ధమైన వాటా కోసం బీజేపీ పార్టీ పోరాడుతుందన్నారు.