PLD: చిలకలూరిపేట నియోజకవర్గంలోని మూడు ప్రధాన రోడ్లకు, మరమ్మతులు, ప్యాచ్ వర్క్‌లకు ప్రభుత్వం మొత్తం రూ.9 కోట్లు కేటాయించిందని ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటనలో తెలిపారు. ప్రజల ఇబ్బందులను గమనించి సకాలంలో నిధులు కేటాయించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.