GNTR: శ్రీ ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజము ఆధ్వర్యంలో గురువారం గుంటూరులో విశ్వకర్మ హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల అభ్యున్నతికి ఆలోచించిన మహానుభావుల త్యాగమే మనకు మార్గదర్శకం కావాలి అన్నారు.