KRNL: ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బదిలీ అయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఐఏఎస్- 2022 బ్యాచ్‌కు చెందినవారు. ఈయన సేవలు మరువలేనివని ఆదోని డివిజన్ ప్రజలు కొనియాడుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.