ప్రకాశం: ఒంగోలు నగరంలో ఉన్న పలు స్పా సెంటర్లను పోలీసులు గురువారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్పా సెంటర్ల నిర్వాహకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. స్పా సెంటర్ల ముసుగులో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.