మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ, రిచా ఘోష్(94) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. SA బౌలర్లలో ట్రయాన్ 3, మ్లాబా 2, మారిజాన్ 2 వికెట్లు తీశారు. SA టార్గెట్: 252.