కోనసీమ: ముమ్మిడివరంలో లైసెన్స్ లేకుండా అక్రమంగా బాణాసంచా నిల్వ చేసిన ఒక ఇంటిపై ముమ్మిడివరం పోలీసులు దాడి చేసి బాణాసంచాను సీజ్ చేశారు. నగర పంచాయతీ పరిధి రాజుపాలెంలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఆ ఇంటిపై దాడి చేసి సుమారు రూ.30 వేలు విలువైన బాణాసంచాను సీజ్ చేసి కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.