TPT: రేణిగుంట మండలం కరకంబాడి రెవెన్యూ సర్వే నంబర్ 453 చెన్నయ్య గుంట గుంట పొరంబోకు స్థలాన్ని కొంతమంది ఆక్రమించి షెడ్లు నిర్మించినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన స్వయంగా స్థలాన్ని పరిశీలించారు. మూడేళ్లుగా గుంట భూమిలో అనధికారిక నిర్మాణాలు గుర్తించామన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా షెడ్లు కట్టినట్లు విచారణలో తేలిందని తెలిపారు.