సత్యసాయి: జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ (IAS-2020) బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డు సీఈఓగా నియమించారు. అదనంగా ఏపీ మెరిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు.