KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామం కడప చెన్నై జాతీయ రహదారి నందు గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కృష్ణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. రాజంపేట నుండి కడపకు పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో వెళుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కిందపడ్డాడు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.