HYD: గ్రూప్-1 నియామకాల అవకతవకలపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులను బాధపెట్టే విధంగా ఈ ప్రభుత్వాలు ఉండకూడదని, ఏదైనా పొరపాటు జరిగితే సరి చేసుకోవాలన్నారు. గ్రూప్-1 ఇష్యూను ఒక తల్లి కోణంలో చూస్తున్నానన్నారు.